Breaking News :

TV5 మూర్తి కొత్త ఛానల్ పెట్టబోతున్నాడా?

తెలుగు మీడియాలో యాంకర్లు ఓనర్లు అవడం కొత్తేమి కాదు. రవి ప్రకాష్ టీవీ తెరపై నుండి కనుమరుగైపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో చాలా ఛానళ్లలో పని చేస్తున్న టాప్ యాంకర్లు పోటీ పడుతున్నారు. కానీ రవి ప్రకాష్ కి కిలో మీటర్ దూరంలో కూడా ఎవరూ రాలేకపోతున్నారు అనేది వాస్తవం. వాస్తవాలు ఏవైనా, జరిగింది ఏదైనా రవి ప్రకాష్ లా వార్తలు చెప్పడం, డిబేట్లు చేయడం ఎవరి వాళ్ళ కావట్లేదు అనేది రియాలిటీ.

రవి ప్రకాష్ ని అందుకునే ప్రాసెస్ లో న్యూస్ రీడర్లు, యాంకర్లు అయ్యారు. న్యూస్ డిబేట్లను రియాలిటీ షో లెవెల్లో హోస్ట్ చేసారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది TV5 మూర్తి. ఇంతకుముందు మహా టీవీ లో ఉన్న మూర్తి అంతకుముందు ఏబీఎన్ లో ఉన్నారు. చానళ్ళు మారడం మూర్తి కి కొత్తేమి కాదు. అయన ఫేమస్అ అయిందే అలా.

ఈ మధ్య అయన బాగా ఫోకస్ పెట్టిన అంశం అమరావతి. దాని మీద అయన పెట్టిన ఫోకస్, అందరి ఫోకస్ అయన మీదకు మార్చేసింది. ఏకంగా అమరావతి రైతుల కోసం పోరాట ఉద్యమకారుడిగా కూడా మారిపోయాడు మూర్తి. అమరావతిపై జరిగిన ఒక డిబేట్లో ఆయన అర్ణబ్ గోస్వామిని తలపించే పెర్ఫార్మన్స్ చేసారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. అయన ఆ రేంజులో ఊగిపోడానికి కారణం ఏమై ఉంటుందని అందరు అనుకున్నారు. మూర్తి tv5 నుండి కూడా వెళ్లిపోతున్నారని, అయితే ఈ సారి వేరే ఛానల్ లో జాయిన్ అవ్వట్లేదని వినికిడి. ఏకంగా ఆయనే ఛానల్ పెట్టబోతున్నారట. దీనికి కూడా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఫండింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ వేచి చూడాలి.

Read Previous

టీడీపీకి రాజీనామా .. డెడ్ లైన్ పెట్టిన కేశినేని నాని

Read Next

బిగ్ బ్రేకింగ్: సుగాలి ప్రీతి తల్లితో జగన్