మళ్ళీ పీకేని తగులుకున్న కత్తి మహేష్. రవి ప్రకాష్ అండతోనేనా?

130

2017 – 2018 సంవత్సరాల మధ్య కాలం తెలుగు రాస్జ్త్రాలకు పట్టిన ఒక దరిద్రం అనే చెప్పాలి. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా తల గోడకేసి బాదుకోవాలనేంతలా విసిగించిన వార్తలు, వ్యక్తులు ఇద్దరే. ఒకరు కట్టి మహేష్ అయితే మరొకరు .. ఆ పేరెందుకులెండి.

ఈ ఇద్దరు వ్యక్తులు అత్యధికంగా కనిపించిన టీవీ స్క్రీన్ TV9. ఆ దారిద్య్రానికి ఆద్యం పోసింది వీళ్ళు పెట్టిన డిబేట్లే. కత్తి మహేష్ ఏదో ఒకటి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం, వాటిని పట్టుకొని వీళ్ళు డిబేట్లు చేయడం. తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఒక మలుపు తిప్పేసిన సంఘటనలు అవి.

అయితే కత్తి మహేష్ ని పెంచి పోషించింది పవన్ కళ్యాణ్ పై ఉసిగొలిపింది TV9 రవి ప్రకాష్ అని , పవన్ కళ్యానే స్వయంగా తన ట్వీట్ల ద్వారా ప్రపంచానికి తెలియజేసాడు. అక్కడి నుండే రవి ప్రకాష్ పతనం మొదలైంది.

ఈ రోజు రవి ప్రకాష్, తాను సొంతంగా పెట్టుకున్న ఛానల్ నుండే గెంటేయబడటానికి కారణం పవన్ చేసిన సంచలన వ్యాఖ్యలే కారణం అని మీడియా లో ముచ్చట. పవన్ చేసిన వ్యాఖ్యల ద్వారా బాగా హర్ట్ అయిన TV9 మాజీ యజమాని శ్రీని రాజు వెంటనే ఛానల్ బిజినెస్ నుండి బయటపడాలని అనుకున్నారట. తన పరువు పోవడానికి కారణం రవి ప్రకాషే అని, అందుకే అంత తక్కువ సమయంలో అందులోనుండి బయటపడ్డారని సమాచారం.

ఎన్నికల ముందు కత్తి మహేష్ ని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించింది. తానూ చేసే వ్యాఖ్యలు సామాన్య ప్రజానీకానికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని అలా చేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చాడు కత్తి మహేష్.

పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ కత్తి మహేష్ కామెంట్లు చేయడం మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ మీద పాగా తీర్చుకోడానికి కత్తి ని మళ్ళీ రంగంలోకి రవి ప్రకాషే దించినట్టు గుసగుసలు. కత్తి వ్యాఖ్యలను, సోషల్ మీడియా లో పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే తన బినామీ ఛానల్ మోజో టీవీ ని పైకి లేపాడో , ఇపుడు అదే విధంగా మళ్ళీ తాను కొత్తగా సీక్రెట్గా లాంచ్ చేసుకున్న తన పాత వెబ్ సైట్ తోలి వెలుగు ని కూడా అలానే పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని పీకే అభిమానులు కొందరు సోషల్ మీడియా లో బయటపెట్టారు.

కత్తి రివ్యూ వీడియోలు ఆ వెబ్సైటు యూట్యూబ్ ఛానల్ లో మొదలయ్యాయి కూడా. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో చూడాలి.