Breaking News :

రేటింగ్స్ లో దూసుకెళ్తున్న TV9, T న్యూస్

TRP రేటింగ్స్ విషయం లో తెలుగు న్యూస్ ఛానళ్ల మధ్య పోటా పోటీ , తెలుగు సినిమా కలెక్షన్ల కోసం జరిగే ఫ్యాన్ వార్స్ కన్నా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ TRP రేటింగ్స్ లో ఎప్పుడు ముందుండేది TV9 మాత్రమే. TV9 ని ఇప్పటివరకు ఏ ఛానల్ కూడా బీట్ చేయలేక పోయింది.

అయితే చాల ఛానళ్ల ఓనర్లు మొదటి స్థానం కోసం TV9 తో పోటీ పడటం వేస్ట్ అని నిర్ణయించుకొని 2 వ స్థానం కోసం పోటీ పడటం మొదలు పెట్టారు. 2 వ స్థానం లో NTV ఉంటుంది ఎప్పుడు. అయితే ఈ మధ్య ఆ స్థానం చేజార్చుకుంటుంది NTV. దీనికి చాలానే కారణాలు ఉన్నాయి. కాంట్రావర్సీలకు దూరంగా ఉండటమే అనేది మీడియా వర్గాలు చెప్తున్న మాట. రెండోది NTV కి కాస్త భక్తి ఎక్కువే. ఈ రెండు నెలలు కోటి దీపోత్సవం పైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది ఆ ఛానల్ యాజమాన్యం కూడా. అది కూడా కారణం అయ్యి ఉండొచ్చు.

అయితే ఇప్పుడు ఆ రెండో స్థానాన్ని V6 మరియు T న్యూస్ లు పోటీ పడి సంపాదించుకుంటున్నాయి. 4 వ స్థానంలోనో, ఎక్కడో మూలాన ఉండే V6 & T న్యూస్ చానళ్ళు ఇలా రెండో స్థానానికి ఇంత తక్కువ కాలంలో రావడానికి ముఖ్య కారణం ఆర్టీసీ సమ్మె అని చెపుకోవచ్చు .

ఆర్టీసీ సమ్మె కి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు కథనాలు ప్రచురించి V6 ఎక్కువమందిని ఆకర్షిస్తే, ప్రభుత్వ మద్దతు వార్తలు కథనాలు ప్రచురించి ఎక్కువ మందిని ఆకర్శించింది Tన్యూస్ ఛానల్.

Image result for v6 news

ఇపుడు V6 రెండో స్థానంలో ఉంటె, T న్యూస్ మూడో స్థానంలో ఉంది. NTV నాల్గవ స్థానంలో ఉంది.

Image result for t news

అయితే TV9 విషయంలో చాలా మంది రవి ప్రకాష్ వెళ్లిపోవడంతో ఛానల్ పని అయిపోయిందని భ్రమ పడ్డారు. రవి ప్రకాష్ మద్దతు దారులు కూడా TV9 పై వ్యతిరేక వార్తలు ప్రచురించారు. ఆర్టీసీ సమ్మె లో అయితే ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులని పెట్టి TV9 పై వ్యతిరేఖ నినాదాలు చేసారు. అయితే ప్రజలు మాత్రం TV9 ని దూరం పెట్టలేదనేది TRP రేటింగుల్లో దూసుకెళ్తూ నిరూపించుకుంది. ఈ మధ్య చెత్త కాంట్రావర్సీలకు దూరంగా ఉంటూ, కొన్ని సార్లు ప్రభుత్వనికి మద్దతుగా ఉంటుందన్న ఆరోపణలు ఉన్నా కూడా మెరుగైన వార్తలను ప్రచురిస్తూ అందరి మన్ననలూ పొందుతుంది.

రవి ప్రకాష్ ఉన్న లేకపోయినా , TV9 లో ఇపుడున్న టీం ఛానల్ ని సరైన దారిలోనే తీసుకెళ్తుందనేది ఇపుడు సోషల్ మీడియా లో కూడా వినిపిస్తున్న మాట.

Read Previous

పవన్ కళ్యాణ్ మనిషి మంచోడే కానీ

Read Next

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ స్కీం పెట్టనున్న కేసీఆర్?