గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్
Timeline

గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా ట్విట్టర్ లో ట్రెండ్

ఈ రోజు ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ 73 వ వర్ధంతి. ఆయన 30 జనవరి 1948 న టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే చేత హత్య చేయబడ్డాడు. బాపు వర్ధనతి సందర్భంగా దేశ అధ్యక్షుడు రామ్‌నాథ్ కోవింద్ మరియు ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. అదే సమయంలో, రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మహాత్మా గాంధీన జ్ఞాపకం చేసుకున్నారు. విశేషమేమిటంటే, బాపు మన మధ్య లేడు, కానీ అతని ఆలోచనలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయి అంటూ ట్వీట్ చేసారు.

అయితే గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే కి మద్దతుగా కొందరు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. గాంధీని చంపడం తప్పు కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. గాంధీ ఎంతో మంది హిందువుల చావుకు కారణం అంటూ, అలాంటి గాంధీని చంపడం గాడ్సే చేసిన గొప్ప పని అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ఇంకోవైపు ప్రపంచానికే ఆదర్శంగా ఇలిచిన గాంధీ లాంటి మహనీయుడును చంపినా టెర్రరిస్ట్ గాడ్సే కి మద్దతుగా ట్వీట్లు చేసేవాళ్ళు కూడా టెర్రరిస్టులే అని, గాంధీని చంపిన గాడ్సే దేశ భక్తుడు అంటే దానికన్నా మూర్కత్వం ఉండదని భారతీయులు ట్వీట్ చేస్తున్నారు.

https://twitter.com/bhagva_1/status/1355373760287698946?s=20

Leave a Reply

Your email address will not be published.