వైరల్ : పారిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు
Timeline

వైరల్ : పారిపోయి పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు

జార్ఖండ్‌, కొదెర్మ జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒక రోజు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఇంట్లో వారికి ఈ విషయం చెబితే ఒప్పుకోరని భావించి, ఆ ఇద్దరు అమ్మాయిలు ఇంటినుంచి బయటకు వెళ్ళి, నవంబర్‌ 8వ తేదీన ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆ ఇద్దరు అమ్మాయిలు వారి ఇళ్లకు ఆరు కిలోమీటర్ల దూరంలోని చంద్రచౌక్‌ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలు పెట్టారు.

వీరిద్దరూ చంద్రచౌక్‌లో ఉంటున్నారని తెలుసుకున్న ఇరు కుటుంబాల వారు అక్కడికి చేరుకుని వారితో తీవ్రంగా గొడవ చేశారు. తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించగా, ఆ ఇద్దరు అమ్మాయిలు మేజర్లు కావటంతో మేము జోక్యం చేసుకోమని చెప్పి వెళ్లిపోయారు. దీనిపై ఆ అమ్మాయిలు మాట్లాడుతూ, “దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని మమ్మల్ని మా కుటుంబాలు బెదిరిస్తున్నాయి. కానీ, మేము దాన్ని లెక్క చేయం. మేము ఇలాగే జీవించాలనుకుంటున్నాం. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న మేము గుడిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యాం. త్వరలో మా పెళ్లిని కోర్టు ద్వారా చట్టబద్దం‌ చేయటానికి ప్రయత్నిస్తామని” చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published.