బిజ్: 350 మంది భారతీయుల ఉద్యోగాలు తీసేసిన UC బ్రౌజర్
Timeline

బిజ్: 350 మంది భారతీయుల ఉద్యోగాలు తీసేసిన UC బ్రౌజర్

చైనా వస్తువులను బహిష్కరించాలని దేశంలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ సహా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో టిక్‌టాక్‌‌తో పాటు షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ తదితర కీలక యాప్‌లు ఉన్నాయి.

అయితే ఈ నిర్ణయానికి ప్రతి చర్యగా ఈ సంస్థలు వాటికి ఉన్న ఇండియన్ బ్రాంచులలో ఆపరేషన్స్ ని ఆపేసి ఉద్యోగులను తొలగించిందం మొదలు పెట్టాయి. అత్యధిక మంది చైనాకి సంబందించిన mi ఫోన్లు వాడుతూ ఉంటారు ఇందులో ఎక్కువగా UC బ్రౌసర్లనే వినియోగదారులు సమాచారం వెతకడం కోసం వాడుతుంటారు. అయితే ఇపుడు UC బ్రౌసర్ వారి ఇండియా ఆపరేషన్స్ ని ఆపేసింది. అంతే కాకుండా వారి సంస్థ నుండి 315 మంది భారతీయులను తొలగించింది.

ఈ వార్తను ప్రముఖ బిజినెస్ పత్రిక livemint ప్రచురించింది.

UC బ్రౌసర్ ఇండియాలో 2009 నుండి ఉంది. UC బ్రౌసర్ తో పాటుగా న్యూస్ అగ్రిగేటర్ గ కూడా కార్యకలాపాలు చేస్తుంది. UC బ్రౌసర్ కి ప్రపంచ వ్యాప్తంగా 430 మిలియన్ ఆక్టివ్ యూజర్స్ ఉంటె అందులో 130 మిలియన్ యూజర్స్ భారత్ కి చెందినవారే ఉండటం విశేషం.

అంతే కాకుండా ప్రముఖ అంతర్జాతీయ వార్త పత్రిక రాయిటర్స్ కథనం ప్రకారం అలీ బాబా కి సంబందించిన వీడియో ప్లాట్ఫార్మ్ VMate కూడా తమ భారత ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిపింది.

యాప్స్ బ్యాన్ తో ఇప్పటికే చాల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అంతే కాకుండా చాల మంది ఈ యాప్స్ ద్వారా కంటెంట్ క్రియేట్ చేసి పాపులర్ అయినా చాల మంది ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అంతే కాకుండా వారు మానసికంగా కూడా ఒత్తిడికి లోనవుతున్నారని పలు పత్రికలూ వెల్లడించాయి

Leave a Reply

Your email address will not be published.