బిగ్ షాకింగ్: అమిత్ షా కి కరోనా పాజిటివ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా సోకినట్టు అమిత్ షా స్వయంగా నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు కూడా టెస్టులు చేయించుకోండి.’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.