సింగర్ బాలు గురించి ఈ గొప్ప విషయాలు తెలుసా ?
Timeline

సింగర్ బాలు గురించి ఈ గొప్ప విషయాలు తెలుసా ?

స్. పి. బాలసుబ్రమణ్యం పూర్తి పేరు శ్రీపతి పండితరద్యుల బాలసుబ్రహ్మణ్యం. బహుముఖ ప్రతిభావంతుడు బాలు. నేపధ్యగాయకుడుగా సంగీత దర్శకుడుగా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,సినీ నిర్మాతగా ఆయన బహుముఖ బాధ్యతలు నిర్వహించారు.ప్లేబ్యాక్ సింగర్ గా బాలు తన తొలి పాటను 1966, 15 డిసెం బర్ న శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమా కోసం రికార్డు చేశారు. ఆయన గురువు ఎస్. పి.కోదండపాని దాని సంగీత దర్శకులు.

తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో కలిపి వేలాది పాటలు పాడారు. మొత్తం 16 భారతీయ భాషలలో 40,000 కు పైగా పాటలు పాడారు ఎస్సీ బాలసుబ్రమణ్యం. ఇది ఒక రికార్డు. ఒకే రోజు 56 పాటలు రికార్డు చేసిన అరుదైన ఘనత బాలు పేరు మీద ఉంది. 1981 ఫిబ్రవరి 8 న ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు బెంగళూరులోని స్వరకర్త ఉపేంద్ర కుమార్ కోసం కన్నడలో 21 పాటలు, తమిళంలో 19 పాటలు, ఒక రోజులో హిందీలో 16 పాటలు రికార్డ్ చేశారాయన.

1980 చిత్రం శంకరభరణంతో బాలు కెరీర్ లో మరో మలుపు. బాలు శాస్త్రీయంగా శిక్షణ పొందిన గాయకుడు కాదు. ఈ సినిమా కోసం కొన్ని రోజుల పాటు కఠోర సాధన చేశారుజ శంకరాభరణంతో బాలు ప్రతిభ దింగతాలకు వ్యాపించింది. తొలిసారి ఆయనను జాతీయ అవార్డు వరించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలను కె.వి. మహా దేవన్ స్వరపరిచారు. ఆ మరుసటి ఏడాదే కె.బాలచందర్ హిందీలో తీసిన ఏక్ డుజే కే లియే లో బాలు పాటలు బాలీవుడ్ లో మార్మోగిపోయాయి. ఎవరి నోట విన్నా తేరే మేరే బీచ్ మే …పాటే. ఆ పాట ద్వారా బాలూ రెండో సారి (1981)లో ప్లేబ్యాక్ సింగర్‌గా మరో జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు.

హీరోల గాత్రానికి తగ్గట్టు గొంతు మార్చి పాడటం బాలు ప్రత్యేకత. ఎన్టీయార్, ఏఎన్నార్ పాడుతున్నట్టే ఉంటుంది ఆయన పాడితే. తెలుగుతో సరిసమానంగా బాలసుబ్రహ్మణ్యం తమిళంలో పాడి అలరించారు. 1970 లలో ప్రఖ్యాత సంగీత దర్శకడు ఎమ్మెస్ విశ్వనాథన్ తో కలిసి బాలు చేసిన అద్భుతాలు ఎన్నో.. ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేషన్, జెమిని గణేషన్ వంటి మహామహులకు పాడారాయన. పి. సుశీలా, ఎస్.జానకి, వాణీ జయరామ్, ఎల్. ఆర్. ఈశ్వరితో కలిసి యుగళగీతాలు రికార్డ్ చేశారు. సినీ రంగానికి రాకముందు నుంచే ఇళయరాజాతో అనుబంధం ప్రారంభమైంది. ఇద్దరు కలిసి అనేక కచేరీలు చేశారు.

నాలుగు భాషల్లో జాతీయ అవార్డులు అందుకున్న అరుదైన గాయకలు ఎస్పీ. ప్లేబ్యాక్ సింగర్‌గా మొత్తం ఆరు జాతీయ పురస్కారాలు అందుకున్నారాయన. ఇక వివిద రాఫ్ర్ట ప్రభుత్వ అవార్డుల నుంచి అందుకున్న అవార్డులు లెక్కలేనన్ని. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులుఆయన ఖాతాలో ఉన్నాయి. భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు కూడా ఆయన సొంతమైంది. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ (2001) మరియు పద్మ భూషణ్ (2011) పౌర పురస్కారాలతో గౌరవించింది.

బాలు ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడి ఇంకా ఇలాంటి ఎన్నో పురస్కారాలు అందుకోవాలని కోరకుందాం.. ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ప్రార్తిద్దాం..

ఇది వ్రాసిన వారు : విరుపు డిజిటల్ పత్రిక