అన్‌స్టాప‌బుల్‌: బాలయ్య – మోహన్ బాబుల మధ్య వార్!
Entertainment Timeline Tollywood

అన్‌స్టాప‌బుల్‌: బాలయ్య – మోహన్ బాబుల మధ్య వార్!

Unstoppable: Balakrishna and Mohan Babu Episode Viral

డిజిటల్ ప్రపంచంలో ‘ఆహా’ వేదిక సరికొత్త ప్రోగ్రామ్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణతో ‘అన్‌స్టాప‌బుల్‌’ షోను తీసుకొస్తున్నారు. తాజాగా దీనికి సంబందించిన మొదటి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో చేస్తుంటే బాలయ్య తన ట్రాక్ ను పూర్తిగా మార్చేశారు అనిపిస్తోంది..

“అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవరు ఆపుతారో చూద్దాం” అని గర్జిస్తూ నటసింహం డిజిటల్ ప్రొగ్రాంలోకి అడుగుపెట్టారు. ఇక మొదటి ఎపిసోడ్ లో మంచు మోహన్ బాబు హాజరైయ్యారు. ఈ ప్రోమో చూస్తుంటే ఏంజరుగుతుందో అనే ఉత్కంఠ మొదలైంది. ఇద్దరు సంచలన కామెంట్స్ కు పెట్టింది పేరుగా అటు రాజకీయాల్లో గాని, ఇటు సినిమాల్లో గాని పేరుంది. సరిగ్గా, ఇదే పాయింట్ ను ‘ఆహా’ అందిపుచ్చుకోవడంలో సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ ప్రోమో దూసుకుపోవడంతో పాటుగా, ఈ ఎపిసోడ్ లో వేడెక్కించిన ప్రశ్నల.. సమాధానాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దివాళీ సందర్బంగా నవంబర్ 4న ఈ ప్రసారం కానుంది.

ఈ వీడియోలో బాలయ్య అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా కొత్త అవతారంలో కనిపించారు. కామెడీ, కాంట్రవర్సీ, అలాగే ఈ ఇద్దరి జీవితాలకు సంబంధించిన సినీ, రాజకీయ విషయాలపై ఎన్నో సీక్రెట్స్ ఈ ప్రోమో ద్వారా ఆసక్తిని కలిగించాయి. 

మోహన్ బాబును తను నటించిన సినిమాల్లో అస్సలు ఇష్టం లేని సినిమా ఏది.? అని అడగగా.. ‘పటాలం పాండు’ అని బయటపెట్టారు. రాజకీయ విషయాల గురించి మాట్లాడుతూ.. షో సాక్షిగా నేను నిన్ను ఎప్పుడైనా కష్టపెట్టానా…? అని మోహన్ బాబును అడిగారు బాలయ్య. ఆ తర్వాత విష్ణు, మంచు లక్ష్మి వచ్చి షోలో జాయిన్ అయ్యాక ఫన్ మరింత రెట్టింపు అయ్యింది.

“తెలుగుదేశం స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన తదనంతరం టీడీపీ పార్టీ పగ్గాలు నువ్వు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకిచ్చావ్?” అంటూ సూటిగా బాలయ్యను ప్రశ్నించారు మోహన్ బాబు. దీనిపై ఆ ఒక్కటి అడగొద్దు.. అన్నట్లుగా బాలకృష్ణ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఇక చిరంజీవి గారి మీద మీకు నిజంగా వున్నా అభిప్రాయం ఏంటి..? అని బాలయ్య, మోహన్ ను ప్రశ్నించడం ఆసక్తిని రేకిస్తోంది. అంతలోనే మరో ప్రశ్నగా ‘సాయంత్రం 7:30 తర్వాత ఎం చేస్తారా..? అంటూ బాలయ్య అడగ్గానే మోహన్ బాబు నవ్వేశారు. ఆపై పెగ్గులా పాట రావడంతో నవ్వులు పూశాయి. ఇలా మొత్తానికి ‘అన్‌స్టాప‌బుల్‌’ షోలో ఫన్‌కు ఫుల్‌స్టాప్ లేదని స్పష్టమవుతోంది.