హత్రాస్ కేసు మరవకముందే… 3 నెలల ముందు అత్యాచారం ..ఇప్పుడు పెట్రోల్ పోసి
Timeline

హత్రాస్ కేసు మరవకముందే… 3 నెలల ముందు అత్యాచారం ..ఇప్పుడు పెట్రోల్ పోసి

ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌ కేంద్ర బింధువుగా వరుస అత్యాచార ఘటనలు జరుగుతుండటం అటు రాజకీయంగా నేతల్లో, ఇటు ప్రజల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. మోనా హత్రాస్ కేసు మరవకముందే మరో ఘాతుకం జరిగింది.

బులంద్‌షహర్‌లో 15 ఏళ్ల మైనర్‌పై ఆగష్టు 15న ముగ్గురు దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరు జైలుల్లో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే కేసును ఉపసంహరించుకోవాలని నిందితుల మామ బాధితురాలిపై ఒత్తిడి చేసాడు. నిందితుల కుటుంబం నుంచి బెదిరింపులు తలెత్తడంతో తనకు తానుగా నిప్పంటించుకున్నానని వీడియోపెట్టింది. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో కాలిన గాయాలతో బాలిక బులంద్‌షహర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.

 తన కూతురిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అత్యాచార ఘటనలో అలసత్వం ప్రదర్శించినందుకు ఇద్దరు పోలీసులను విధుల నుంచి తొలగించారు. వారి స్థానంలో సీనియర్‌ పోలీస్‌ అధికారులను నియమించారు