షాకింగ్ : మరో పరువు హత్య .. కడుపుతో ఉన్న కూతురినే హత్య
Timeline

షాకింగ్ : మరో పరువు హత్య .. కడుపుతో ఉన్న కూతురినే హత్య

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​ జిల్లా కిషన్​దాస్​పుర్​ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు పెళ్లి కాకుండానే గర్భవతి అయిందనే నెపంతో కూతుర్ని కిరాతకంగా నరికి చంపారు. ఆ తరువాత ఈ హత్యను వేరే ఎవరో చేసినట్టు ప్లాన్ చేసినా పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దొరికిపోయి .

అస్వస్థతకు గురైన కూతుర్ని అక్టోబరు 24న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలు 6నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు. దీంతో అబార్షన్​ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. గర్భం వచ్చేందుకు కారణమైన వ్యక్తి ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఆ యువతి సమాధానం చెప్పలేదు. విసుగు చెందిన తల్లిదండ్రులు ఆమెను నరికి చంపారు

అయితే అక్టోబరు 25న ప్రతాప్​గఢ్​​ జిల్లా అలపుర్ రైల్వే స్టేషన్​ పరిధిలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని నవాబ్​ గంజ్​ పోలీసులు గుర్తించారు. తన కూతుర్ని ఎవరో హత్య చేశారని మృతురాలి తండ్రి కమలేష్ కుమార్​ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎఫ్​ఐఆర్ నమోదు చేసుకున్న నవాబ్​గంజ్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తల్లిదండ్రులనూ విచారించగా అసలు విషయం బయటపడింది.