Breaking News :

వైరస్ ని చంపుతున్నారా? మనుషుల్ని చంపుతున్నారా?

ఢిల్లీ నుంచి యూపీకి వచ్చిన వలస కూలీలపై మాత్రం యూపీ ప్రభుత్వం… జంతువుల మాదిరి ట్రీట్ చేసింది.ఈ ఘటన బరేలిలో జరిగింది. బస్సుల్లో వచ్చిన వలస కార్మికులను ఒకచోట కూర్చొబెట్టి… క్రిమి సంహారక మందు స్ప్రే చేయించింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియోలో అధికారుల మాటలు వింటే… గుంపులో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘మీరు కళ్ళు మూసుకోండి… పిల్లల కళ్ళు కూడా మూయండ’ని సిబ్బంది అరవడం వినిపించింది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఈ ఈ వీడియోను ట్యాగ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కరోనాకు వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాటం చేస్తున్నారని, అయితే పేదలపై ఇంత అమానవీయంగా ప్రవర్తించడం దారుణమని ఆమె విమర్శించారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారిపై కెమికల్స్‌ను స్పే చేయడం సరికాదని అన్నారు. దీనివల్ల వారి సంరక్షణ కాదు కదా… ఆరు ఆరోగ్యం పాలవుతారని ప్రియాంగ గాంధీ విమర్శించారు.

Read Previous

హృదయాలు గెలిచేసిన కెసిఆర్.. దేశమంతా ప్రశంసలు

Read Next

కరోనా ఎఫెక్ట్ : చదువు ఆన్ లైన్ లోనే చెప్పేస్తున్న “నారాయణ”