గుంటూరు జిల్లాలో ఏపీ వడ్డెర డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారు. కాజా టోల్‌ప్లాజా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఫ్రీ పాస్ లేకపోవటంతో రేవతిని టోల్ సిబ్బంది ఆగాలని సూచించడంతో ఆగ్రహంతో ఊగిపోయారామె. నన్నే ఆపుతావా అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అడ్డుగా ఉన్న బారికేడ్‌ను నెట్టడమే కాకుండా అక్కడి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తమ డ్యూటీ తాము చేస్తే బాధ్యత గల పదవిలో ఉండి దేవళ్ల రేవతి దురుసుగా ప్రవర్తించడంపై మండిపడుతున్నారు సిబ్బంది. వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి తమపై దాడి చేశారని కాజ టోల్‌గేట్‌ సిబ్బంది మంగళగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులకు అందజేశారు.

అయితే ఈ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. రేవతి కి కూడా జగన్ ఆఫీస్ నుండి ఫోన్ వెళ్లిందని, వెంటనే సీఎం ని కలిసి వెళ్ళాలి అని తెలుస్తుంది. వైసీపీ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం రేవతి పదవి పోయే అవకాశం ఉన్నట్టు , తక్షణమే రాజీనామా చేయించే దిశగా జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.