‘వకీల్ సాబ్’ కు హీరోయిన్ ఫిక్స్

తన కెరీర్ లో 25 సినిమాలు పూర్తిచేసిన పవన్ కళ్యాణ్.. అజ్ఞాతవాసి తర్వాత రాజకీయ బాట పట్టారు. కానీ ప్రేక్షకులు, దర్శకనిర్మాతల కోరిక మేరకు రెండేళ్ల తర్వాత రీసెంట్‌గా తిరిగి కెమెరా ముందుకొచ్చారు. తన 26వ సినిమాగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొచ్చారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలకిగాను, నివేదా థామస్ .. అంజలి .. అనన్యలను ఎంపిక చేశారు. మరో ముఖ్యమైన పాత్రకిగాను కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి శ్రుతి హాసన్ ను ఖరారు చేసినట్టు సమాచారం. తమిళంలో విద్యాబాలన్ చేసిన పాత్రకి గాను శ్రుతి హాసన్ ను తీసుకున్నారని అంటున్నారు. గతంలో పవన్ – శ్రుతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సంచలన విజయాన్ని సాధించింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది.

Read Previous

షియోమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Read Next

మోదీ సూచనలను పాటిద్దాం: పవన్