టీడీపీకి బుద్ది చెప్పిన వంశీ

52

టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. వైసీపీలో చేరడంతో ఆయన తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, సీఎం జగన్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు గురువారం వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అన్నారు. చాలా ఏళ్ల నుంచి జగన్ తో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడిని అన్న కారణంతో టీడీపీ నేతలు తనను దూరం పెట్టారని ఆరోపించారు. కాగా తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని.. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళితే పరిశీలిస్తానని చెప్పారని ఆయన చెప్పారని అన్నారు. అయితే వైసీపీలో ఎప్పుడు చేరతారా మాత్రం వంశీ వెల్లడించలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వంశీ… అనేక అంశాలపై చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించారు వల్లభనేని వంశీ. 2009లో తన ప్రాణాలను ఫణంగా పెట్టి టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్… ఆ తరువాత టీడీపీకి ఎందుకు దూరమయ్యారని వల్లభనేని వంశీ చంద్రబాబును ప్రశ్నించారు. పదేళ్ల పాటు టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో అంతా ఆలోచించాలని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా నల్లపూసగా మారిపోయారని వల్లభనేని వంశీ అనడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వల్లభనేని వంశీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.