వాల్మీకి రివ్యూ : చూడొచ్చా లేదా?

21

మిరపకాయ్ , గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ కి హిట్టు బొమ్మ లేదు. హరీష్ కూడా చాల కసితో వాల్మీకి ( గద్దల కొండ గణేష్ ) ని తెరకెక్కించాడు. ఈ రోజు ఈ సినిమా రిలీజు అయింది.

వాల్మీకి తమిళ్ లో సూపర్ హిట్టైన సిద్దార్థ్ జిగర్తాండ కి రీమేక్. దానిని యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసాడు. దబాంగ్ కి గబ్బర్ సింగ్ కి ఏ రేంజులో డిఫరెన్స్ ఉంటుందో మేకింగ్ స్టైల్ లో , జిగర్తాండ కి వాల్మీకి కి కూడా అంతే తేడా ఉంటుందనేది ట్రైలర్స్ , టీజర్లు చూసినప్పుడే అర్ధం అయింది. హరీష్ ఈ సినిమా ని ఎంచుకోవడమే అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది ఫస్టు. మిక్కీ ఇచ్చిన మ్యూజిక్ ఇప్పుడు నెంబర్ వన్ లో ఉంది. ఎక్కడ చుసిన వాల్మీకి పాటలే.

ఇందులో ఇద్దరు హీరోలు, గద్దలకొండ గణేష్ గా హీరో వరుణ్ చేస్తే, ఇంకో హీరోగా అదర్వ మురళి చేసాడు. వరుణ్ గద్దలకొండ గణేష్ గా అందర్నీ అలరించాడు. ఆ రాక్షసత్వం, ఆ లుక్ అదిరిపోయాడు. అధర్వ కూడా తన రోల్ కి న్యాయం చేసాడు. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తాడు అనడం లో డౌట్ లేదు.

గద్దలకొండ గణేష్ పై ఎటాక్ తో సినిమా మొదలవుతుంది. గణేష్ ఒక గ్యాంగ్స్టర్. అధర్వ ఇందులో డైరెక్టర్ అవ్వాలనుకునే యువకుడి పాత్రా లో కనిపిస్తాడు. తన సినిమా కోసం కథను వెతికే క్రమంలో గణేష్ గురించి తెలుసుకొని , గణేష్ పైనే సినిమా తీయాలనుకుంటాడు. అలా గణేష్ దగ్గరికి చేరుతాడు అధర్వ. ఆ తర్వాత గణేష్ ని ఎలా ఒప్పించాడు, తన గతం ఎలా తెలుసుకున్నాడు , ఇక వీళ్లిద్దరి మధ్య జరిగే కథనే వాల్మీకి.

గద్దలకొండ గణేష్ గ వరుణ్ బాడీ లాంగ్వేజ్ కానీ, తెలంగాణ యాస కానీ, అరిపించేసాడు. గబ్బర్ సింగ్ రేంజులో కాదు కాని వరుణ్ ని మాత్రం పక్కా మాస్ హీరోగా చూయించడంలో హరీష్ సక్సెస్ అయినట్టే. ఇప్పటివరకు వరుణ్ కి తెలుగు ఆడియన్స్ లో క్లాస్ స్, లవ్లీ హీరోగా మాత్రమే ఇమేజ్ ఉండేది. ఈ దెబ్బతో నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాడు వరుణ్.

ఆయనకు బోస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రీదేవిగా పూజ ని బాగా చూయించాడు హరీష్. ఇక జర జర సాంగ్ కూడా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంత వరుణ్ కామెడీ ఆకట్టుకుంటే , సెకండ్ హాఫ్ లో , క్లింక్ వచ్చే సరికి కాస్త బోర్ అనిపించినా, మొత్తంగా చూసుకుంటే సినిమా హిట్టు అనే చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు.

కంగ్రాట్స్ హరీష్ శంకర్ !