కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మి ఎన్నో సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర నటుడు, సీనియర్ యాక్టర్ అయిన శరత్ కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మి. గతంలో శరత్ కుమార్ విశాల్ తండ్రి మంచి స్నేహితులు. ఇక వీరివురి స్నేహం కారణంగానే విశాల్, వరలక్ష్మీ లు ప్రేమలో పడ్డానికి కారణం అయ్యింది. అయితే రీసెంట్ గా శరత్ కుమార్ కు విశాల్ కు మధ్య జరిగిన గ్యాప్ ఏర్పడడంతో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటె, అయితే చాలా కాలం తర్వాత ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి.
తాజాగా, 35 సంవత్సరాల వయస్సు ఉన్న వరలక్ష్మీ శరత్ కుమార్, ఒక క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. క్రాక్ సినిమా తర్వాత సౌత్ ఇండియా అంతటా వరలక్ష్మీ పేరు ‘జయమ్మ’గా పాపులర్ అయింది. ఈ సినిమాతో ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న తరుణంలో వరలక్ష్మి పెళ్లి చేసుకుందో లేదో చూడాలి మరి.


