సాక్షి పేపర్ కి యాడ్స్ ఇవ్వొద్దట


సీఎం జగన్మోహన్ రెడ్డికి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో దళిత వర్గాలపై వరుస దాడులు జరుగుతుంటే… సాక్షి పత్రికలో దళిత వార్తలను నిషేధించినట్లుగా కనిపిస్తోందని లేఖలో పేర్కొన్నారు.

దళిత వర్గాలపై దాడులు జరుగుతుంటే.. సాక్షి పత్రిక పట్టించుకోవడం లేదని.. తెదేపా నేత వర్ల రామయ్య సీఎం జగన్​కు బహిరంగ లేఖ రాశారు. ఆ పత్రికకు ప్రకటనలను నిలిపేయాలని కోరారు.

వార్ల రామయ్య

దళిత వార్తలు ప్రచురించకుండా… దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న సాక్షి పత్రికకు ప్రకటనలు నిలిపివేయాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకున్నప్పుడు పత్రికను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా సమాన దృష్టితో ప్రజలకు వార్తలు అందించే దృష్టితోనే నడుపుతామని యాజమాన్యం ప్రమాణం చేసిందని గుర్తు చేశారు.