వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్ విడుదల
Timeline

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ ట్రైలర్ విడుదల

సినిమా సినిమాకు విభిన్నమైన కథ, లుక్ ట్రై చేస్తూ రోటీన్‌‌కు భిన్నంగా ముందుకు సాగుతున్న స్టార్ వరుణ్ తేజ్. తాజాగా ఈ మెగా ఫ్యామిలీ హీరో నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

చదువుకనే సమయం నుంచి రఫ్ అండ్ టఫ్ గా ఉండే వ్యక్తిగా కనిపించబోతున్నాడు వరుణ్. గద్దలకొండ గణేష్.. అలియాస్ ఘనిగా వరుణ్ నటిస్తున్నాడు. కాలేజీలో సరదాగా, పూజా హెగ్డే ప్రేమికుడిగా కనిపించిన వరుణ్.. ఎందుకు అలా గ్యాంగ్ స్టర్ గా మారాల్సి వచ్చింది అనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారు.

మేకింగ్ పరంగా సినిమా సూపర్ గా ఉన్నట్టు ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతున్నది. వరుణ్ లోని మరో యాంగిల్ ను సినిమాలో చూపించినట్టు సినిమా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. తెలంగాణా యాసలో వరుణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published.