ఆ నేతను మళ్ళీ టీడీపీలో చేరేలా చేసిన బాబు టీం

21

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. టీడీపీ ఇప్పట్లో కోలుకునే సూచనలు కనపడకపోవడంతో ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతలంతా వైసీపీ, బీజేపీలో చేరిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో టీడీపీకి ఒక గుడ్ న్యూస్ వినిపించింది. రెండు నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజా శుక్రవారం తిరిగి టీడీపీ పార్టీలో చేరారు.

అయితే తాజాగా వరుపుల రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా కొనసాగేందుకు రాజా తిరిగి పార్టీలో చేరారు. అయితే టీడీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎలాగైనా తమ పట్టును కోల్పోకూడదని అధినేత చంద్రబాబు చెప్పడంతో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందరూ వరపుల రాజాతో కలిసి చర్చలు జరిపారు. అయితే నిర్వహించిన చర్చలు ఫలించడంతో వరుపుల రాజా మళ్ళీ పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.