ఫన్నీ : అంపైర్ మన తెలుగోడే.. @ ఐపిఎల్ .. వీడియో వైరల్ 😀

దేశ భాషలందు తెలుగు లెస్స .. ఎక్కడికెళ్లినా తెలుగు వారు కనిపించినా తెలుగు మాట వినిపించినా మనలో వచ్చే కిక్కే వేరు.

మరి అలాంటి మన తెలుగు మాట ఐపిఎల్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంటే లైవ్ లో వినబడితే?

ఇంగ్లీష్ లో కామెంటర్ ఏదో వాగుతుంటే, అర్థం కాకపోయినా వింటాం. అది క్రికెట్ పై ఉన్న మోజు.

ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఒక చిత్రమైన సంభాషణ చోటు చేసుకుంది. అది కూడా అంపైర్ మరియు ఆటగాడికి మధ్యన.

దినేష్ కార్తీక్ & అంపైర్ కి మధ్యన జరిగిన ఈ తెలుగు సంభాషణ వీడియో తెగ RT లు సంపాదిస్తుంది. ఆ వీడియో కింద కామెంట్లు చూసి మీరు నవ్వుకోండి