టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు సుకుమార్ ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలోనే నాయికగా కృతిసనన్ ని ఎంపిక చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. విజయ్‌కి జోడీగా ఇప్పటి వరకు నటించని భామ అయితేనే సినిమాకి కొత్తదనం వస్తుందని భావించి ఆమెతో చర్చలు జరిపారట దర్శక-నిర్మాతలు.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో ‘1 నేనొక్కడినే’ చిత్రంలో నటించింది కృతి. ఆమె నటనకి ఫిదా అయిన సుకుమార్ ఈ ప్రాజెక్టుతో మరో అవకాశం ఇవ్వబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం.
కృతి ప్రస్తుతం ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.