మీకు మాత్రమే చెప్తా టీజర్ – మస్త్ ఉంది

విజయ్ దేవరకొండ హీరోగానే పరిచయం మనకు. అయితే ఇపుడు తనను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ని తానూ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమా ద్వారా హీరో గ పరిచయం చేస్తున్నాడు విజయ్.

ఇందులో యాంకర్ అనసూయ కూడా లీడ్ రోల్ చేస్తుంది. తనను విమర్శించింది అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ తన ప్రతిభకి అవకాశం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ విషయం లో విజయ్ చాల గ్రేట్.

హీరో గ ఒక రెంజులో దూసుకెళ్తున్న మనోడు ఈ సినిమాతో నిర్మాత అయ్యాడు. మరి నిర్మాతగా ఎలాంటి సక్సెస్ కొడుతాడో చూడాలి. టీజర్ అయితే మస్త్ ఫన్ ఉంది. మరి సినిమా కూడా ఇదే రేంజులో నవ్విస్తే పైసా వసూల్ అవ్వడం ఖాయం. అల్ ది బెస్ట్ విజయ్ & టీం.