ఈసారి విజయసాయి రెడ్డి.. కథ మొదలెట్టిన బీజేపీ
Timeline

ఈసారి విజయసాయి రెడ్డి.. కథ మొదలెట్టిన బీజేపీ

ప్రస్తుత ఏపీ అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కు చెందిన కీలక నేతల్లో ఆ పార్టీ ఎంపీ మరియు కేంద్రంలోని ఏపీ యొక్క రాజ్య సభ నేత అయినటువంటి విజయసాయి రెడ్డికు ఇప్పుడు భారీ షాక్ తగలనుందా అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైశ్లేషకులు అంటున్నారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డిను ఢిల్లీలోని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించబడ్డారు. అయితే అసలు విజయసాయి రెడ్డి యొక్క రాజ్యసభ సభ్యత్వం చెల్లదని అతన్ని ఆ హోదా నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి ఊహించని షాకిచ్చారు.

ఒక పక్క రాజ్యసభ సభ్యునిగాను అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఎలా ఉంటారని అందుకే అతని రాజ్య సభ సభ్యత్వం రద్దు చెయ్యాలని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది.దీనిపై ఆ పార్టీకు చెందిన నేతలు కూడా ఈ వార్తలు నిజమే అని తాము రాష్ట్రపతిని కోరామని ఖరారు చేసేసారు.మొత్తానికి మరి విజయసాయి రెడ్డికు గట్టి షాకే తగిలిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published.