పార్టీ కోసమే ప్రెస్‌మీట్లు.. ప్రజలకోసం కాదు

16

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి మండిపడ్డారు. హత్యాచార ఘటన జరిగిన 72 గంటల తర్వాత కేసీఆర్ స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ తెరాస పార్టీకి మాత్రమే పనిచేసే నాయకుడని, ప్రజల కోసం పాటుపడే నాయకుడు కాదని రాములమ్మ అభిప్రాయపడ్డారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించగానే.. సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి డబ్బా కొట్టారని.. ఓ ఆడపిల్ల మానవ మృగాల చేతిలో బలైతే ఇప్పుడు స్పందిస్తారా అంటూ మండిపడ్డారు. మొక్కుబడిగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ద్వారా విచారణ జరపిస్తామని చేతులు దులుపుకున్నారని వ్యాఖ్యానించారు.