సీఎం జగన్ దగ్గరకు దివ్య తల్లి తండ్రులు
Timeline

సీఎం జగన్ దగ్గరకు దివ్య తల్లి తండ్రులు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను ఇవాళ దివ్య పేరెంట్స్ కలవనున్నారు. హోం మంత్రి సుచరితతో కలిసి జగన్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలుస్తారు. సీఎంను కలిసే ఏర్పాటు చేయాలని రెండు రోజుల క్రితం పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రిని దివ్య కుటుంబసభ్యులు కోరారు. దివ్య తల్లిదండ్రుల విజ్ఞప్తితో సీఎంను కలిసేందుకు మంత్రి ప్రత్యేకంగా చొరవ చూపారు. దీంతో దివ్య పేరెంట్స్‌ను కలవడానికి ఇవాళ మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా, విజయవాడ బీటెక్ విద్యార్థిని దివ్య తేజస్విని మర్డర్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. నాగేంద్ర – దివ్య వివాహం చేసుకున్నట్లు ఉన్న ఫొటో మార్ఫింగ్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి దిశ స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దివ్య స్నేహితులను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆమె తీసిన సెల్పీ వీడియోలో చెప్పిన వ్యక్తి ఎవరు ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. దివ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చివరి సారిగా మాట్లాడిన ఓ వీడియో.. కీలకంగా మారింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నానని… అతను తన జీవితం నాశనం చేయాలని చూశాడని ఆ వీడియోలో చెప్పుకుంది. ఈ సమయంలో దివ్య పేరెంట్స్‌ సీఎంను కలవబోతున్నారు.