Breaking News :

కోహ్లీ హవా

ఇండియన్ క్రికెటర్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇంటర్నెట్ లో మన వాళ్ళ హవా ఎక్కువగా ఉంటుంది. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అంతా ఇంతా క్రేజ్ కాదు.ఇదిలా ఉంటే తాజాగా టీం ఇండియా ఆటగాళ్ళు ఒక అరుదైన రికార్డ్ సాధించారు. 2015 డిసెంబరు -2019 డిసెంబరు మధ్యకాలంలో కోహ్లి గురించి ప్రపంచవ్యాప్తంగా నెలకు సగటున 1.76 మిలియన్ సార్లు సెర్చ్ చేసారట. దీనితో గత నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా అగ్రస్థానంలో నిలిచాడు. SEMరష్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కోహ్లీ తర్వాత ఇంటర్నెట్‌లో ధోని గురించి నెలకు సగటున 9.39 లక్షల సార్లు వెతికినట్లు సంస్థ వెల్లడించింది. టాప్-10 ఆటగాళ్ల జాబితాలో ఏడుగురు క్రికెటర్లు ఉన్నారంటే మన వాళ్లకు ఉండే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Read Previous

హెచ్చరిక: హైదరాబాద్ వాసులు ఆ బెలూన్లను తాకొద్దు

Read Next

పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్