Breaking News :

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: కోహ్లీ 1.. రోహిత్ 2

Leeds: India’s Virat Kohli and Rohit Sharma after winning World Cup 2019 match against Sri Lanka at Headingley Stadium in Leeds, England on July 6, 2019. (Photo: Surjeet Yadav/IANS)

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసిన తరువాత ఐసిసి వన్డే బ్యాట్స్‌మెన్ల జాబితాలో భారత కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలు టాప్‌లో నిలిచారు. 887 పాయింట్లతో కోహ్లి తొలి స్థానంలోనూ, రోహిత్‌ శర్మ 873 పాయింట్లతో రెండో స్థానంలోనూ నిలిచారు. ఇటీవల టెస్టుల్లోను విరాట్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్‌ (2442 పరుగులు) లంక మాజీ ఓపెనర్‌ జయసూర్య (2387; 1997లో) 22 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. అయితే ఓవరాల్‌గా 2455 పరుగులతో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు.

Read Previous

ఎన్నార్సీని వ్యతిరేకించిన జగన్

Read Next

‘అల..వైకుంఠపురములో’ స్పెషల్ గెస్ట్ గా ఎన్టీఆర్!