Breaking News :

బిగ్ బ్రేకింగ్: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు బాద్యులైన 12 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్ననే ఈ ఘటనపై హైపర్ కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ నివేదికలో నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నివేదికలో కమిటీ పలు ముఖ్య అంశాలను ప్రస్తావించింది. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది.

గ్యాస్ లీకేజీకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్య నిర్లక్ష్యమే కారణంగా పెర్కొండూ సంస్థ సీఈవో సున్‌కి జియాంగ్‌, డైరెక్టర్‌ డీఎస్‌ కిమ్‌, అడిషనల్‌ డైరెక్టర్‌ పీపీసీ మోహన్‌రావులతో సహా మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు.

దుర్ఘటన జరిగిన మే 7నే ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థపై గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కమిటీ నివేదిక అనంతరం ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.

Read Previous

కరోనా బ్రేకింగ్: దేశంలోనే ఫస్ట్..తెలంగాణలో మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం

Read Next

ఇండియన్ స్టూడెంట్స్ కి అమెరికా: మీ దేశం వెళ్లిపోండి