వలస కూలీలకు విజయవాడ పోలీసుల సేవ అద్భుతం

దేశంలో చాలా కఠినంగా అమలులో ఉన్నటువంటి లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో, సొంత ప్రాంతాలకు వెళ్లాలన్న వారందరు కూడా దాదాపుగా కాలినడకన ప్రయాణమవుతున్నారు. ఈ క్రమంలో వారందరు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కాగా ఇలా నడుస్తూ వెళ్తున్నటువంటి వలస కూలీలకు విజయవాడ పోలీసులు ఎంతో మేలు చేస్తు, వినూత్నమైన సేవ అందిస్తున్నారు. కాగా కూలీలందరికోసమని ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక ఉచిత సేవలు అందిస్తున్నారు పోలీసులు.

కాగా నడుస్తూ వస్తున్నటువంటి వారందరికోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ లో ORS ప్యాకెట్లు, మజ్జిగ, అరటిపండ్లు, కాళ్లకు చెప్పులను ఉచితంగా అందిస్తున్నారు. కాగా విజయవాడలోని గొల్లపూడి Y జంక్షన్, బెంజ్ సర్కిల్ దగ్గర బెజవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఈ సెర్వింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీతోపాటూ ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. కాగా పోలీసులు ఎంతో మానవత్వంతో స్పందిస్తూ, తమకు సేవలు అందిస్తున్నందుకు గాను మనస్ఫూర్తిగా వందనాలు సమర్పిస్తు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు.