బ్రేకింగ్ | ఆసుపత్రికి శశికళ … విడుదలకు ముందు ఆరోగ్య సమస్య
Timeline

బ్రేకింగ్ | ఆసుపత్రికి శశికళ … విడుదలకు ముందు ఆరోగ్య సమస్య

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఈ నెల 27న విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు.

Leave a Reply

Your email address will not be published.