బిగ్ న్యూస్ : 2015 ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహను అరెస్ట్ చేసిన ఏసీబీ
Timeline

బిగ్ న్యూస్ : 2015 ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహను అరెస్ట్ చేసిన ఏసీబీ

ఓటుకు నోటు కేసులో ఉదయ్ సింహను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను ఏసీబీ కోర్టు జారీ చేసింది. ఎంబీడబ్ల్యూ జారీ కావడంతో ఉదయ్ సింహను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఓటుకు నోటు కేసు మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్‌ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. దర్యాప్తు అధికారులు తనపై మోపిన అభియోగాలను ఎమ్మెల్యే సండ్ర తోసిపుచ్చారు.

Leave a Reply

Your email address will not be published.