‘వార్‌’ మూవీ రివ్యూ

17

చిత్రం: వార్‌
నటీనటుటు: హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ఫ్రాఫ్‌, వాణి కపూర్‌, అశుతోష్‌, తదితరులు
దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌
నిర్మాత: ఆదిత్య చోప్రా
నిర్మాణ సంస్థ: యష్‌ రాజ్ ఫిలింస్‌
విడుదల తేదీ: 02-10-2019

బాలీవుడ్‌ కండల వీరులు హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి కలిసి నటించిన చిత్రం కావడం, దానికితోడు వారిద్దరూ పోటాపోటీగా తలపడే పాత్రల్లో నటించడంతో ‘వార్‌’పై ఆసక్తి ఏర్పడింది. దీంతోపాటు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో తెరకెక్కించడంతో అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాలో హృతిక్‌, టైగర్‌ మధ్య పోరాట సన్నివేశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ట్రైలర్‌లో చూపించారు. అప్పట్నుంచి అభిమానులు సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో బుధవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది..? హృతిక్‌రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారా?

కథేంటంటే: సైనికాధికారి కబీర్‌(హృతిక్‌) కొన్ని కారణాల వల్ల రెబెల్‌గా మారుతాడు. అతణ్ని ముట్టుబెట్టడానికి మరో సైనికాధికారి ఖలీద్‌ని (టైగర్‌) రంగంలోకి దింపుతారు. ఖలీద్‌ గతంలో కబీర్‌ వద్దే యుద్ధవిద్యల్లో శిక్షణ తీసుకుని ఉంటాడు. అందుకే అతణ్ని గురువుగా భావిస్తుంటాడు. ఇప్పుడు గురువుతోనే తలపడాల్సిన పరిస్థితి. ఈ గురుశిష్యుల సమరంలో ఎవరు గెలిచారు? కబీర్‌ ఎందుకు రెబల్‌గా మరాడు అన్నది తెరపై చూడాలి.

కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు హలీవుడ్‌ చిత్రాలను తలపించాయి. ‘వార్‌’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ‘మిషన్‌ ఇంపాజిబుల్’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరీయస్‌’ చిత్రాల్లోని సన్నివేశాలకు తగ్గట్టుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకువెళ్లింది.

రేటింగ్స్: 2/5