నేడు ఏలూరులో డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటన
Timeline

నేడు ఏలూరులో డబ్ల్యూహెచ్‌వో బృందం పర్యటన

అంతుచిక్కని వ్యాధితో కలకలం రేగిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నేడు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం పర్యటించనుంది. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు ఏలూరు చేరుకున్నారు. నగరంలో బాధితులు అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో ఆ బృందం పర్యటించి నమూనాలు సేకరించనుంది.

దీంతో పాటు కొందరు బాధితులతోనూ ప్రతినిధులు మాట్లాడనున్నారు. దీంతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్రబృందం కూడా నేడే ఏలూరులో పర్యటించనుంది. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నేటి సాయంత్రానికి తమ నివేదికను కేంద్రానికి పంపనుంది.

Leave a Reply

Your email address will not be published.