కరోనా: నెక్స్ట్ లెవల్ అతి ప్రమాదం – WHO
Timeline

కరోనా: నెక్స్ట్ లెవల్ అతి ప్రమాదం – WHO

 ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది’ అని హెచ్చరించింది. గురువారం-శుక్రవారం మధ్య 24 గంటల్లో లక్షా 50 వేల కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్‌ టెడ్రెస్‌ అధనోమ్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. వీటిలో సగానికి పైగా కేసులు రెండు అమెరికా ఖండాలు, దక్షిణాసియా, మధ్యప్రాచ్య దేశాల్లోనే నిర్ధారణ అయినట్లు అధనోమ్‌ తెలిపారు.

ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే కఠిన నిబంధనలు అమలు చేయాల్సిందేనని టెడ్రోస్‌ అధనోమ్‌ తేల్చి చెప్పారు. ఇప్పటికే విధించిన లాక్‌డౌన్‌లతో ప్రజలు విసిగిపోయారన్నారు. చాలా దేశాలు ఆర్థిక వ్యవస్థల్ని తెరిచే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. కానీ, వైరస్‌ వ్యాప్తి మాత్రం అంతకంతకూ పెరుగుతోందన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం వంటి నియమాల్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు

Leave a Reply

Your email address will not be published.