ఇక తెలంగాణలో 11 వరకు మందు షాపులు
Timeline

ఇక తెలంగాణలో 11 వరకు మందు షాపులు

రాష్ట్రంలో మద్యం దుకాణాల వేళలపై ఇప్పటి వరకు అమలవుతున్న ఆంక్షలను అబ్కారీ శాఖ పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అమలులో ఉన్న ఆంక్షలు ఎత్తివేయగా… పాత వేళలు అమలులోకి వచ్చినట్లైంది.  

ఇప్పటి నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు తెరచి ఉంటాయని స్పష్టం చేశారు. మార్చి చివర వారంలో మద్యం దుకాణాలను పూర్తిగా మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది. ఆ తరువాత లాక్‌డౌన్‌ నిబంధనల్లో కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వగా మే 6 నుంచి మద్యం దుకాణాలు తెరిచారు.

 మొదట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే దుకాణాలు తెరచి ఉండేట్లు ఆంక్షలు విధించారు. ఆ తరువాత కేంద్రం క్రమంగా లాక్‌ డౌన్‌ నిబంధనలను సడలిస్తూ రావడం వల్ల ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించారు. ఆ తరువాత కొవిడ్‌ నిబంధనల్లో మరిన్ని సడలింపులు ఇవ్వగా… ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దుకాణాలు తెరచుకోడానికి అనుమతి ఇచ్చారు.  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలన్నింటినీ దాదాపు ఎత్తివేయగా… అబ్కారీ శాఖ కూడా మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ.. ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published.