Breaking News :

భారత్ కి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం

ప్రపంచ దేశాలన్నినింటిని కూడా చిన్నాభిన్నం చేస్తున్నటువంటి భయంకరమైనకరోనా వైరస్ కారణంగా ఇప్పటికే మనమందరం కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాం. ఇప్పటికే మనదేశంలో ఎంతో మంది ప్రముఖులు చాలా వరకు విరాళాలు అందించినప్పటికీ కూడా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ అంశాలు కనిపించడం లేదు. ఇకపోతే ఈ తరుణంలో ప్రపంచబ్యాంకు, ప్రపంచంలోని దేశాలన్నింటికీ కూడా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించింది. కాగా ఈనేపథ్యంలో ఎమర్జెన్సీ ఫైనాన్సింగ్ ఫండ్‌లో భాగంగా భారత్‌కు రూ.7600 కోట్ల(1 బిలియన్‌ డాలర్లు) ను ఆర్థిక సహాయంగా ప్రకటించింది.

అయితే ప్రపంచంలోని ప్రధానమైన 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ఇస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు అధికారికంగా ప్రకటించింది. అయితే కరోనా వైరస్ కారణంగా దాదాపుగా కొన్ని దేశాలు తీవ్రంగా నష్టపోవడం వలన ఈనిర్ణయం తీసుకున్నామని వరల్డ్ బ్యాంక్ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌క్యూటివ్‌ డైరెక్టర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఇచ్చిన నిధులను స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేటరీల ఏర్పాటు, డయాగ్నస్టిక్స్‌, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు నిధులనువాడనున్నారని సమాచారం.

Read Previous

డ్రోన్ లతో స్ప్రే.. కెసిఆర్ సంచలన నిర్ణయం

Read Next

ఇప్పటికైనా నిజమైన లెక్కలు బయట పెట్టండి: జగన్ కి బాబు లేఖ