Breaking News :

నీ ఫ్యాన్స్ ని కంట్రోల్ లో పెట్టడం నేర్చుకో

ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్‌ని విమర్శించే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదని అన్నారు. ప్రజల కోసం ప్రశ్నించేందుకు రాజకీయాలలోకి వచ్చానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ నాడు అధికారంలో ఉన్న టీడీపీనీ వదిలేసి వైసీపీపై ఆరోపణలు చేశారని దానిని చూసే ప్రజలు రెండు చోట్లా ఓడించారని ఎద్దేవా చేశారు.

అయితే సీఎం జగన్ దమ్ము, ధైర్యం ఏపీ ప్రజలకు తెలుసని అందుకే భారీ మెజారిటీతో గెలిపించి సీఎంను చేశారని అన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఫాలో అవ్వడం మానలేకపోతున్నారని అందుకే ఇద్దరు కలిసి తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో నీ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని కాస్త వారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి అని వార్నింగ్ ఇచ్చారు. పవన్ వాళ్ళను ఎలా కంట్రోల్ చేయడమనేది మొదట నేర్చుకుంటే మంచిదని అనిల్ కుమార్ ఆరోపించారు.

Read Previous

తెలంగాణలో హత్యాచారాలు తక్కువ

Read Next

పార్టీ కోసమే ప్రెస్‌మీట్లు.. ప్రజలకోసం కాదు