సుజనా చౌదరి వైసీపీలో చేరాలనుకుంటున్నారట

23

తాజాగా ఏపీ రాజకీయ వర్గాల్లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున సంచనలం రేపిన సంగతి అందరికి తెలిసిందే.ముఖ్యంగా వైసీపీ పార్టీ శ్రేణుల్లో సుజనా చేసిన కామెంట్స్ చిచ్చు రేపాయి.తమతో వైసీపీ కు చెందిన 20 మంది ఎంపీలు టచ్ లో ఉన్నారని సమయం వచ్చినపుడు అవన్నీ బయట పెడతామని చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో మరింత వేడి పుట్టించాయి.

దీనితో వైసీపీ చాప్టర్ క్లోజ్ అనుకునే లోపే అదే వైసీపీ పార్టీకు చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుజనా విషయంలో బాంబు పేల్చారు.సుజనా అన్నట్టుగా తమ పార్టీ నుంచి ఏ ఎంపీ కూడా బీజేపీ పార్టీలో చేరడం లేదని అలా సుజనాకు ఎవరు టచ్ లో ఉన్నారో వారి పేర్లు బయట పెట్టాలని అన్నారు.

అంతే కాకుండా ఇంకా సుజనాయే వైసీపీలో చేరాలనుకుంటున్నారని బాంబు పేల్చారు.ఆయన తమ పార్టీలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పి సంచలనం రేపారు.అది జస్ట్ దాటవేయడానికి చెప్పారో లేక ఏ సమాధానం దొరక్క అలా అన్నారో ఆయనకే తెలియాలి.