మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్
Timeline

మెగా హీరో ట్రైలర్ విడుదల చేయనున్న ఎన్టీఆర్

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన అన్ని పాట‌లు శ్రోత‌ల‌‌ను అల‌రిస్తున్నాయి. పాటలు, టీజర్‌ విడుదల తర్వాత ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా వెయిట్‌ చేస్తున్నారు. ఫైనల్‌గా ఫిబ్రవరి 12న మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు‌. అయితే తాజాగా త్వరలోనే ఉప్పెన ట్రైలర్ విడుదల చేస్తున్నట్లుగా మూవీ చిత్రబృందం పోస్టర్ ద్వారా తెలిపింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ విడుదల చేయనున్నట్లుగా హింట్ కూడా ఇచ్చారు. సుకుమార్ కథ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Image

1 Comment

Leave a Reply

Your email address will not be published.