దారుణం: హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద యువకుడు సూసైడ్
Timeline

దారుణం: హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ వద్ద యువకుడు సూసైడ్

నాంపల్లిలోని భాజపా కార్యాలయం ముందు యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సిద్దిపేట శివారులో ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

సంజయ్‌ అరెస్టును నిరసిస్తూ  రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన  శ్రీను ఆదివారం భాజపా కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. బండి సంజయ్‌పై చేయి వేస్తే సహించేది లేదని యువకుడు హెచ్చరించాడు. అరెస్టు జరిగిన సమయంలో తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఇప్పుడు ఆత్మహత్యకు యత్నించానని తెలిపాడు. స్పందించిన పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు.