31 వరకు ఏపీ బంద్.. మొత్తం వివరాలు

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ సుభిక్షంగా ఉంది: సీఎం జగన్‌

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ సుభిక్షంగా ఉందని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడికి కృషి చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు అధికారులు శ్రమిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేలమందిని స్క్రీనింగ్‌ చేశాం.  ప్రతి జిల్లా కేంద్రంలో 200 ఐసోలేటెడ్‌ పడకలు ఏర్పాటు చేస్తున్నాం.  ప్రతి నియోజకవర్గంలో వంద ఐసొలేటెడ్‌ పడకలు ఏర్పాటు చేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారితో తిరిగిన  వారు వెంటనే 104కు ఫోన్‌ చేయాలి. వైద్య చికిత్స తీసుకున్న తర్వాత కొందరు ఇళ్లకు వెళ్లారు. కరోనా నివారణలో గ్రామ వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది కృషి గొప్పది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నాం: సీఎం జగన్‌  

ఏపీలో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ అంతర్రాష్ట్ర సరిహద్దులు మూసివేస్తున్నాం. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నాం. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఉద్యోగులకు విడతల వారీగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. విదేశాల నుంచి వచ్చేవారంతా 14రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావద్దు. అత్యవసరమైతే తప్పక బయటకు రావద్దు. అందరూ ఇళ్లలోనే ఉండండి. ప్రజలకు ఇదే నా విజ్ఞప్తి. కూరగాయలు, పాలు, మెడిసన్‌ కోసమే బయటకు రండి.  దేశంలో భయానక వాతావరణ ఉంది. ఇలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఇందుకు సహకరించాలని కోరుతున్నా. నిత్యావసర దుకాణాలు తప్ప అన్నింటినీ బంద్‌ చేస్తున్నాం. ఈ సమయంలో ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.’’ అని తెలిపారు.

రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000

అన్ని రాష్ట్రాలతో కలిసి ముందుకెళ్తేనే కరోనాను అరికట్టగలమని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.వెయ్యి అందిస్తాం. ఈనెల 29నే రేషన్‌ సరకులు అందిస్తాం. రేషన్‌కార్డు ఉన్నవారికి కిలో పప్పు ఉచితంగా ఇస్తాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా కలెక్టర్లు చూడాలి. నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు అమ్మితే పోలీసు కేసులు. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉంటాయి’ అని అన్నారు.

Read Previous

31 వరకు తెలంగాణ బంద్.. 2500 కోట్లు ప్రకటించిన కెసిఆర్

Read Next

కరోనా వచ్చిన విషయం ఆ దేశం దాచిపెడుతుందా?