జగన్ ఢిల్లీ టూర్ వాయిదా వేసిన అమిత్ షా

ఆంధ్ర ప్రదేశ్ ముఖయమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు అని రెండు రోజులుగా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు రాత్రి 7 గంటలకు జగన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలవడానికి అపాయింట్ మెంట్ కూడా ఓకే అయ్యింది. కానీ ఉన్నట్టుండి అమిత్ షా షెడ్యూల్ మారడంతో జగన్ టూర్ వాయిదా పడింది. అసలైతే రేపు కూడా అక్కడే ఉండి తిరిగి వచ్చేలా టూర్‌ని షెడ్యూల్ చేసుకున్నారు జగన్.

ఈ రోజు మీటింగ్‌లో కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలను ఆదుకోవాల్సిందిగా జగన్.. కేంద్ర మంత్రి అమిత్‌ షాని కోరనున్నట్టు, అందుకే ఢిల్లీ టూర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానికి రెండు లేఖలను రాశారు జగన్. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే అంశంతో పాటు ఇతర నిర్ణయాలకు సంబంధించి కూడా జగన్ అమిత్‌షాతో చర్చ చేయాలని భావించారట