ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఢిల్లీలో మంగళవారం సాయంత్రం కలిశారు. రాష్ట్రాభివృద్ధి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. సీఎం జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు.

ఢిల్లీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం , అమిత్ షా ని కలిసిన జగన్ అయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొని ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ 3 రాజధానుల అంశంపై చర్చించారని అంతే కాకుండా రాష్టానికి రావాల్సిన నిధులను కాస్త త్వరగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసారు జగన్.

ఈ రోజు  రాత్రి సీఎం జగన్‌ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం బయల్దేరి నేరుగా తిరుపతి చేరుకుంటారు. అక్కడతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

రాత్రి తిరుమలలోనే బస చేసి గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి అజెండాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సాగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి