నేడు శ్రీకాకుళంకు జగన్.. భారీ భద్రత ఏర్పాటు

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్న జగన్మోహన్‌రెడ్డికి భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఇటీవలే మావోయిస్టుల డంప్‌ జిల్లాలో లభ్యం కావడం… ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మావోయిస్టుల ఆనవాళ్లు లభ్యం అవుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రికి జడ్‌ ప్లస్‌ భద్రత ఉంటుంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ ఉంటుంది.

అలాగే ఇద్దరు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 45 మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 118 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 215 మంది ఏఎస్‌ఐ/హెడ్‌కానిస్టేబుళ్లు, 686 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, 85 మంది మహిళా పోలీసులు, 350 మంది హోంగార్డులు, 266 మందితో కూడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంతో సీఎం పర్యటన ప్రారంభం నుంచి ముగిసేంతవరకు భద్రత కొనసాగిస్తారు. ఇప్పటికే జాతీయరహదారిపై తనిఖీలను ముమ్మరం చేశారు.