విశాఖ నుంచి జగన్ పాలన షురూ !

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో ఏ మాత్రం పట్టువీడడం లేదు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులకు అసెంబ్లీలో ఆమోదం లభించినా, మండలిలో బ్రేక్‌లు పడిన విషయం తెలిసిందే. ఏదిఏమైనా వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలనా కార్యకలాపాల ప్రారంభించాలని భావిస్తోంది. మే 26 నుంచి విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రారంభించాలని వైసీపీ సర్కార్ కసరత్తు చేస్తోన్నట్టు తెలుస్తోంది.

మే 25 నాటికి వికేంద్రీకరణ చట్టం అమలులోకి వస్తుందని జగన్ సర్కార్ అంచనా వేస్తుంది. కాగా, జనవరి 22న వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి అడ్డుకుంది. అయితే, నిబంధనల ప్రకారం నాలుగు నెలల కాలంలో కౌన్సిల్ ఆమోదం లేకున్నా చట్ట రూపుదాల్చే అవకాశం ఉందంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ ప్రక్రియ మే 25 నాటికి పూర్తవుతుందని లెక్కలు వేస్తున్నారు.

Read Previous

మోదీ పిలుపుమేరకు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్

Read Next

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తల్లి కన్నుమూత