బ్రేకింగ్ : 5000 కాదు 8000 ఇస్తున్న జగన్

443

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల ప్రక్రియ చాలా వినూత్నమైనదిగా కొన‌సాగుతోంది.

లబ్ధిదారులకు ఇంటి వద్దే సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో జగన్ సర్కారు గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సీఎం జ‌గ‌న్‌ గ్రామ వాలంటీర్ల జీతాల‌ను భారీగా పెంచేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు నెలకు 5000 రూపాయలుగా ఉన్నవారు జీతం కాస్తా 8000 రూపాయలకి జగన్ పెంచేసాడు. వీలైనంత త్వరగా గ్రామ వాలంటరీ యొక్క ప్రిన్సిపాల్ సెక్రటరీ కలవనున్న జగన్ దీని అమలుకు వీలైనంత త్వరగా జరగాలని ఆదేశాలు ఇచ్చేశాడట.