జగన్​కు పరిపాలన అనుభవం లేదు : ఉమ
Timeline

జగన్​కు పరిపాలన అనుభవం లేదు : ఉమ

రాజధాని మార్పుపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఓ వ్యక్తిపై, ఓ వర్గంపైన కక్షతో మూడు రాజధానులు అంటున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా శిబిరాన్ని సందర్శించిన దేవినేని… సీఎం జగన్​కు పరిపాలన అనుభవం లేక ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేతగా జగన్ అనాడు అమరావతికి మద్దతు పలికారని… ఇప్పుడెందుకు 3 రాజధానులంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్​తో బిల్లులు ఆమోదించుకున్నప్పటికీ… ఈ నల్ల బిల్లులు న్యాయసమీక్షకు నిలబడవని దేవినేని పేర్కొన్నారు. కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు, మహిళలు పోరాడుతున్నారని… న్యాయస్థానాల్లో వారికి విజయం దక్కడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.