జగన్ బ్యాన్ చేయాలనుకుంటున్న వెబ్ సైట్లు ఇవే

ఆంధ్ర ప్రదేశ్ యువత ఆన్లైన్ బెట్టింగ్ కు అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని , అలాంటి వెబ్ సైట్లపై తక్షణమే చర్యలు తీసుకొని యువత భవిష్యత్తు ను కాపాడాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో చర్చించి , 132 వెబ్ సైట్లను లిస్ట్ అవుట్ చేసి కేంద్రానికి లేఖ రాసారు. వెంటనే ఈ వెబ్ సైట్లను బ్యాన్ చేయాలనీ కోరారు. ఈ మేరకు కేంద్ర న్యాయ, ఎలక్ట్రానిక్, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు.

వీటన్నింటినీ నివారించేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974 ఏపీ గేమింగ్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చిన విషయాన్ని లేఖలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ చట్టం ద్వారా నిందితులను కఠినంగా శిక్షించే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వెబ్‌సైట్లను బ్యాన్ చేయాలని కోరారు.

చాల కుటుంబాలు ఈ గ్యాంబ్లింగ్ వెబ్ సైట్ల ద్వారా ఆర్థికంగానే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు