ఛలో ఆత్మకూర్ : చంద్రబాబుకి వడ్డీతో తిరిగిచ్చేసిన జగన్
Timeline

ఛలో ఆత్మకూర్ : చంద్రబాబుకి వడ్డీతో తిరిగిచ్చేసిన జగన్

2017 లో వైఎస్ జగన్ ఎయిర్ పోర్టులో, 2019 చంద్రబాబు అమరావతిలో. టిట్ ఫర్ టాట్ రాజకీయాలకు ఆంధ్ర ప్రదేశ్ పెట్టింది పేరు. అందులో భాగంగానే నిన్న చంద్రబాబు 48 గంటల వరకు హౌస్ అరెస్ట్ అవ్వడం, ఛలో ఆత్మకూర్ తుస్సుమనడం.

వైఎస్ జగన్ అధికారంలో వచ్చినప్పటి నుండి తన పార్టీ కి చెందిన 8 మంది వైసీపీ చేసిన దాడుల్లో చనిపోయారని, ఇంకా అలాంటి దాడులతో బాధపడుతున్న 500 మందికి మద్దతుగా, ప్రభుత్వం పై పోరాటం చేసి భరోసా ఇస్తాను అని చంద్రబాబు నాయుడు ఛలో ఆత్మకూర్ ప్లాన్ చేసాడు.

పోలీసులు తన ఇంటిని గేటుతో కట్టివేసినప్పటికీ, పార్టీ నాయకులూ చుట్టుముట్టిన తన కారులో గేటు వద్ద వేచి ఉండటానికే నాయుడు నిర్ణయించుకున్నాడు. తన ఇంటికి వెళ్లే మార్గం వెలుపల బారీకేడ్లతో అడ్డుకున్నారు. చంద్రబాబుని సంకెళ్లతో నిర్బంధం చేయడం జరిగినట్టే తలపించింది అక్కడి వాతావరణం.

నాయుడు ఒక్కడే కాదు తనయుడు లోకేష్ ని, అంతేకాకుండా టీడీపీ లీడర్లందరినీ గృహ నిర్బంధం చేసేసి , హోటల్ రూమ్స్ నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కొందరు బయటకి వచ్చిన వాళ్లలో కేశినేని నాని ప్రకాశం బ్యారేజ్ వరకు రాగలిగిన అక్కడి నుండి తీసుకెళ్లిపోయారు.

కానీ టీడీపీ జగన్ మోహన్ రెడ్డి ని నిరంకుశ పాలకుడిగా చెప్పడం మాత్రం , ఒక్కసారి రివైండ్ బటన్ నొక్కేసి జనవరి 26, 2017 కి వెళ్లకతప్పదనిపిస్తుంది. జగన్ ఇద్దరు వైసీపీ ఎంపీలతో వైజాగ్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్, స్పెషల్ స్టేటస్ డిమాండ్ చేస్తూ సైలెంట్ క్యాండిల్ లైట్ ర్యాలీ రామకృష్ణ బీచులో చేద్దాం అని అక్కడైకి వెళ్లాలని అనుకున్నాడు.

జగన్ ని అక్కడి నుండి సిటీలోకి అనుమతించకపోవడంతో, రన్వే పైనే ధర్నా చేసాడు జగన్. అంతేకాకుండా అక్కడి పోలీసులకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇపుడు ఎలా అయితే 144 సెక్షన్ వేసి బాబుని అడ్డుకున్నారో, అప్పుడు కూడా రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ అని చెప్పి , cii సమ్మిట్ కారణం చెప్పి జగన్ ని అడ్డుకున్నారు.

అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు జులై 2017 లో కాపు లీడర్ ముద్రగడని హౌస్ అరెస్ట్ చేసిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటే, ఇపుడు డెమోక్రసీ , బ్లాక్ డే అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్న బాబు గారు తన CM రోల్ పై కూడా ఇవే ఆరోపణలు వేసుకుంటారా?

జగన్ ని ఎయిర్ పోర్టులో ఆపేయడంతో పోల్చుకుంటే, అది కూడా సైలెంట్ ర్యాలీకి, ఇపుడు పల్నాడు లాంటి ప్రాంతానికి వెళ్లి ఇప్పటికే ఘర్షణలతో, ఆవేశంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇంకా రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకునే బాబు ని హౌస్ అరెస్ట్ చేసి శాంతి భద్రతలను కంట్రోల్ లో పెట్టి జగన్ చేసిన పనిని ప్రజలు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.